డిజిటల్ మాధ్యమాలపై తెలుగు భాష వాడుక అవసరం రోజు రోజుకూ పెరుగుతున్నది. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాలం వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో చరవాణి ద్వారా అంతర్జాలం వాడే వారి సంఖ్య ఇంకా ఎక్కువగా పెరుగుతున్నది. అదే సమయంలో సామాజిక మధ్యమాలయిన ఫేస్ బుక్, వికిపీడియా, బ్లాగ్స్ వంటి వాడకం ఊపందుకున్నది. గ్రాహకుల పరిస్థితి ఇలా ఉంటే, వీరి అవసరాలని తీర్చే స్థాయిలో సమాచారం సరఫరా లేదు. దీనికి ఒక కారణం తెలుగులో రాయగలిగే ఉపకరణాలు, అప్లికేషన్లు, ఫాంట్సుపై అవగాహన లేకపోవడం.
ఈ నేపథ్యంలో, డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వాడకానికి ఉపయుక్తంగా ఉండే నిఘంటువులు, అప్లికేషన్లు, ఖతులు ఇంకా ఇతరత్రా సాధనాలను ఒక్కచోట అందిస్తున్నాము. అట్లాగే మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పుట్టుకువస్తున్న కొత్త డిజిటల్ వేదికలకు సంబంధించిన లింకులు ఇస్తున్నాము. ఈ పట్టిక సమగ్రమూ కాదు, సంపూర్ణమూ కాదు. ఈ విభాగానికి చెందిన ఇతరత్రా సాధనాలను డిజిటల్ మీడియా సంచాలకుల మెయిల్ ఐడీతో (dir_dm[at]telangana[dot]gov[dot]in) పంచుకుంటే వాటిని కూడా భవిష్యత్తులో పొందుపర్చగలము.